లాక్ డౌన్ తో జీతాలు లేక ఇబ్బంది పడుతున్న సమయంలో... పాల ధర పెంపు పై ప్రభుత్వ చర్యను సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాబురావు ఖండించారు. నిత్యావసర వస్తువుల ధరలు పెంచవద్దని, పెంచితే చర్యలు తీసుకుంటామన్న ప్రభుత్వం పాల ధరలు ఎందుకు పెంచుతుందో సమాధానం చెప్పాలని బాబూరావు డిమాండ్ చేశారు.
పెంచిన పాల ధరలు ఉపసంహరించుకోవాలి: సీపీఎం - corona cases in krishna dst
పాల ధరల పెంపు నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సీహెచ్ బాబూరావు డిమాండ్ చేశారు. కరోనా లాక్ డౌన్‌తో ప్రజలు తినటానికే ఇబ్బందులు పడుతున్న ఈ సమయంలో విజయ పాల ధరలను లీటరుకు రెండు రూపాయలు నుంచి నాలుగు రూపాయల వరకు పెంచటం అన్యాయమని అన్నారు.
http://10.10.50.80:6060//finalout3/odisha-nle/thumbnail/08-May-2020/7111849_577_7111849_1588938014573.png
ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులతో పాల వినియోగం తగ్గింది, పాల ధర పెంచితే వినియోగం ఇంకా తగ్గుతుందని అన్నారు. ప్రజలలో రోగనిరోధక శక్తి తగ్గి ప్రజారోగ్యం మరింత క్షీణిస్తుందని... ముఖ్యమంత్రి, ప్రభుత్వం జోక్యం చేసుకుని తక్షణమే పాలధర పెంపుని రద్దు చేయాలని కోరారు.