ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇంధన ధరల పెంపునకు నిరసనగా విజయవాడలో వామపక్షాల ధర్నా.. ఉద్రిక్తత - cpm state Secretary madhu

పెట్రోలు డీజిల్ ధరల పెంపునకు నిరసనగా వామపక్షాల ఆధ్వర్యంలో విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసింది. బారికేడ్లు దాటి నిరసన ప్రదర్శనగా వెళ్లేందుకు ప్రయత్నించిన వామపక్ష నేతలు కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకోవడంతో నిరసన కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది.

cpi cpm parties protest at vijayawada
వామపక్షాల నిరసన

By

Published : Jul 26, 2021, 1:25 PM IST

ధర్నాచౌక్‌లో వామపక్షాల ధర్నా

కేంద్ర ప్రభుత్వం రోజురోజుకూ పెంచుతున్న ఇంధన ధరలకు నిరసనగా విజయవాడలోని ధర్నాచౌక్‌లో సీపీఐ, సీపీఎం శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించాయి. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యకర్తలు నినాదాలు చేశారు. పెట్రోల్ డీజిల్ ధరలను అదుపు చేయాలని పెంచిన ధరను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇంధన ధరలు పెంచుతూ పేద మధ్యతరగతి ప్రజలపై పెను భారాన్ని మోపుతోందని మండిపడ్డారు.

కోవిడ్​తో పేద ప్రజలు అల్లాడుతుంటే ఇంధన ధరలతో మోయలేని భారాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు విమర్శించారు. ధర్నాచౌక్ కూడలికి భారీ ఎత్తున సీపీఐ సీపీఎం నాయకులు రావడంతో అనుమతి లేదని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సమయంలో పోలీసులకు కార్యకర్తలకు తోపులాట జరిగి కాసేపు ఉద్రిక్తత తలెత్తింది. బలవంతపు అరెస్టులు చేశారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు ఖండించారు.

ABOUT THE AUTHOR

...view details