ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నూతన ఆస్తిపన్ను చట్టాన్ని విరమించుకోవాలని నిరసన - cpi leaders protest in vijayawada

ఆస్తిపన్ను పెంపు ప్రతిపాదనలను విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ... సీపీఐ, తెదేపా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. అధికారం కోసం సీఎం జగన్​ ప్రజలను నమ్మించి మోసగించారని విమర్శించారు.

CPI and TDP leaders protest
నూతన ఆస్తిపన్ను చట్టాన్ని విరమించుకోవాలని నిరసన

By

Published : Dec 23, 2020, 6:44 PM IST

నూతన ఆస్తిపన్ను చట్టాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ... విజయవాడ లెనిన్ కూడలిలో సీపీఐ, తెదేపా నాయకులు నిరసన చేపట్టారు. రూపాయి సంక్షేమం పథకం రూపంలో అందిస్తూ... పది రూపాయల భారాన్ని ప్రజలపై మోపుతున్నారని ఆరోపించారు. పన్ను పెంపు చట్టాలను ఎటువంటి చర్చ లేకుండా అసెంబ్లీలో ఆమోదించుకోవటం సామాన్య ప్రజలను ఆందోళనకు గురి చేస్తుందన్నారు. ఆస్తి విలువ ఆధారంగా పన్నులు వేస్తే ప్రజలపై అధిక భారం పడుతుందని వాపోయారు. తక్షణమే జీవో నంబర్ 197, 198 ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details