శ్రీకాకుళం జిల్లా నుంచి హైదరాబాద్కు ప్రయాణిస్తున్న లారీలో... అక్రమంగా తరలిస్తున్న 50 ఆవులను పోలీసులు గుర్తించారు. కృష్ణా జిల్లా మైలవరం ఇంజినీరింగ్ కళాశాల వద్ద పోలీసులు తనీఖీలు నిర్వహిస్తుండగా ఈ లారీని పట్టుకున్నారు. పట్టుకున్న ఆవులను కృష్ణాజిల్లా గో సంరక్షణ సేవాసమితికి అప్పగించారు. ప్రాథమిక వైద్య పరీక్షల అనంతరం ఆవులను గోసంరక్షణశాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అక్రమంగా ఆవుల తరలింపు... పట్టుకున్న పోలీసులు - అక్రమంగా ఆవుల తరలింపు వార్తలు
శ్రీకాకుళం జిల్లా నుంచి హైదరాబాద్కు ప్రయాణిస్తున్న లారీలో అక్రమంగా తరలిస్తున్న 50 ఆవులను... కృష్ణా జిల్లా మైలవరం ఇంజినీరింగ్ కళాశాల వద్ద పోలీసులు పట్టుకున్నారు. అనంతరం వాటిని కృష్ణాజిల్లా గో సంరక్షణ సేవాసమితికి అప్పగించారు.

శ్రీకాకుళం నుంచి అక్రమంగా ఆవుల తరలింపు