ఓ ఆవు అమ్మతనం... ఏం చేసిందో చూడండి... - cow angry on rickshaw person
పదిహేను రోజుల క్రితం అదే ప్రాంతంలో చనిపోయిన లేగదూడను... ఓ వ్యక్తి రిక్షాలో వేసుకొని తీసుకెళ్లాడు. గురువారం ఆ వ్యక్తి తారసపడ్డాడు. దూడను కోల్పోయిన ఆవు అతన్ని గుర్తుపట్టి దాడి చేసింది. ఈ ఘటన కృష్ణా జిల్లా మచిలీపట్నం బస్టాండ్ వద్ద జరిగింది.
మచిలీపట్నం బస్టాండ్ వద్ద ఆవు హల్చల్
కృష్ణా జిల్లా మచిలీపట్నం బస్టాండ్ వద్ద ఆవు హల్ చల్ చేసింది. 15 రోజుల క్రితం అదే ప్రాంతంలో తన దూడ ప్రమాదంలో చనిపోయింది. ఆ లేగదూడను రిక్షాలో తీసుకెళ్లిన వ్యక్తి... ఇవాళ అటుగా వెళ్లటం గుర్తించిన ఆవు... అతనిపై దాడి చేసింది. రిక్షాను తలకిందులుగా చేసింది. ఆవు దాడి నుంచి స్థానికులు బాధితున్ని రక్షించారు. తన బిడ్డను తీసుకెళ్లిన వ్యక్తిని గుర్తుపెట్టుకుని దాడి చేయడంపై... స్థానికులు విస్తుపోయారు.