కృష్ణా జిల్లాల్లో అందుబాటులో ఉన్న టీకాలను 45 ఏళ్లు దాటిన బ్యాంకు, ఆర్టీసీ, పోస్టల్, ఇతర శాఖల ఉద్యోగులకు వేయనున్నారు. వారిలోనూ... తొలి డోసు వ్యాక్సిన్ కు అర్హులైన వారికి వేయించాలని వైద్య ఆరోగ్య శాఖ జిల్లా అధికారులకు ప్రభుత్వం సూచించింది. 45 ఏళ్లు దాటిన వారు కోటీ 33 లక్షల మంది ఉండగా.. 35 శాతం మందికి మాత్రమే టీకా అందింది. కొవాగ్జిన్ మాత్రం రెండో డోసు అవసరమైన వారికి మాత్రమే పంపిణీ చేస్తున్నారు. కొవాగ్జిన్ రెండో డోసు తీసుకోవాల్సిన వారు లక్షా 50 వేల మంది ఉండగా.. ప్రస్తుతం 2 లక్షల టీకాలు అందుబాటులో ఉన్నాయి. అందువల్ల తొలి డోసు ఇచ్చే అవకాశం లేదు. కొవిషీల్డ్ 11 లక్షలా 67 వేల డోసులున్నాయి.
ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు టీకా ఇచ్చిన అనంతరం.. తొలిడోసు కొవిషీల్డ్ టీకాను ఇతరులకు పంపిణీ చేయనున్నారు. రాష్ట్రంలో ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ టీకా పంపిణీకి కేంద్రం అనుమతులు ఇచ్చింది. విశాఖలోని అపోలో, గుంటూరులోని మణిపాల్, విజయవాడలోని రమేశ్ ఆసుపత్రి, నెల్లూరులోని నారాయణ ఆసుపత్రి, శ్రీకాళహస్తి లోని ఎంజీఎం ఆసుపత్రికి అనుమతులు ఇచ్చింది.