కృష్ణా జిల్లాలో చేపట్టిన కొవిడ్ డ్రై రన్ పూర్తిగా విజయవంతం అయిందని జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ వెల్లడించారు. కృష్ణా జిల్లాలో ఐదు ప్రాంతాల్లో కోవిడ్ వాక్సిన్ డ్రై రన్ చేపట్టినట్లు ఇంతియాజ్ తెలిపారు. డ్రైరన్ కోసం ఆదివారం నుంచే సన్నాహాకాలు చేపట్టామని వివరించారు. సెంట్రల్ స్టోరేజి నుంచి వాక్సిన్ కోల్డ్ చైన్ పాయింట్లకు తరలించామన్నారు. కొవిడ్ యాప్‌లో వివరాలు నమోదు చేపట్టామన్న కలెక్టర్...వాక్సిన్ తీసుకునే వారికి సంక్షిప్త సమాచారం పంపించామన్నారు. ఈ 5 కేంద్రాల్లో యాప్‌తో సహ లాజిస్టిక్స్, వాక్సినేషన్‌కు ఎంత సమయం పట్టిందనే అంశాలను పరిశీలన చేశామన్నారు. ఇవన్నీ రియల్ టైమ్‌లో స్టిమ్యూలేషన్కు ఉపకరిస్తాయని పేర్కొన్నారు. వాక్సినేషన్ ప్రక్రియ మొదలు అయితే ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు, ఆస్పత్రులు, కళాశాలలు, గ్రామ సచివాలయలను వినియోగించుకోవచ్చని తెలిపారు.
లోపాలను తెలుసుకునేందుకు కొవిడ్ వ్యాక్సిన్ డ్రై రన్: కలెక్టర్
కొవిడ్ వ్యాక్సినేషన్‌లో వచ్చే లోపాలను తెలుసుకునేందుకు డ్రై రన్ ఉపయోగపడుతోందని కృష్ణా జిల్లా ఇంతియాజ‌్ అన్నారు. ఒకే సారి ఎంత మందికి టీకా వేయవచ్చు, సాంకేతిక పరిజ్ఞానం ఏ మేరకు పని చేస్తుందని పరిశీలిస్తున్నామన్నారు. కొవిన్ యాప్ సమర్థమంతంగా పనిచేస్తోందని కలెక్టర్ ధీమా వ్యక్తం చేశారు. కొవిడ్ వ్యాక్సిన్ అందించేందుకు వైద్యశాఖ సిద్ధంగా ఉందంటున్న కృష్ణా జిల్లా కలెక్టర్‌తో ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖాముఖి.
కృష్ణా జిల్లా ఇంతియాజ్