ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాష్ట్రంలో మరోసారి కొవిడ్‌ వ్యాక్సినేషన్ డ్రైరన్‌ - రాష్ట్రంలో మరోసారి కొవిడ్‌ వ్యాక్సినేషన్ డ్రైరన్ తాజా వార్తలు

రాష్ట్రంలో మరోసారి కొవిడ్‌ వ్యాక్సినేషన్ డ్రైరన్‌ నిర్వహించారు. ఈ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసినట్లు వైద్యులు వెల్లడించారు. ఉదయం 9గంటల నుంచి 12 వరకూ వ్యాక్సినేషన్ ప్రక్రియ జరిగింది.

dry run
dry run

By

Published : Jan 8, 2021, 12:47 PM IST

రాష్ట్రంలో ఇవాళ మరోసారి కరోనా వ్యాక్సినేషన్ డ్రైరన్‌ ప్రక్రియ నిర్వహించారు. ప్రభుత్వం ఎంపిక చేసిన కేంద్రాల్లో డ్రై రన్‌ ఏర్పాటు చేశారు. కడపజిల్లాలోని 108 వైద్య కేంద్రాలు, గుంటూరులోని నరసరావుపేట, కృష్ణా జిల్లా నందిగామలోని ప్రభుత్వాస్పత్రిలో డ్రైరన్‌ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు. తొలుత టీకా వేయించుకునే వారికి వైద్యులు వ్యాక్సినేషన్‌ తీరుపై సూచనలు, సలహాలు ఇచ్చారు. టీకా వేసిన అరగంటసేపు పరిశీలన గదిలో ఉంచి.. ఎలాంటి ఇబ్బంది లేదని తెలిసాకే ఇంటికి పంపించినట్లు వైద్యులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details