కృష్ణా జిల్లాలో నేడు కొవిడ్ వ్యాక్సినేషన్ డ్రై-రన్ మొదలుకానుంది. ఈ మేరకు విజయవాడ జీజీహెచ్, తాడిగడప కృష్ణవేణి డిగ్రీ కాలేజీ, ప్రకాష్ నగర్ పట్టణ ఆరోగ్య కేంద్రం, పూర్ణ ఇనిస్టిట్యూట్, ఉప్పులూరు పీహెచ్సీల్లో.. వ్యాక్సినేషన్ కోసం అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఒక్కో కేంద్రంలో వైద్యాధికారులు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, పోలీసు సిబ్బంది అందుబాటులో ఉంటారు.
వ్యాక్సిన్ కోసం వచ్చేవారు ప్రవేశ మార్గంలో మహిళా పోలీసుకు వివరాలు తెలియజేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత వ్యాక్సిన్ కేంద్రం లోపలికి వెళ్లగానే మూడు గదులు ఉంటాయి. మొదటి గదిలో రిజిస్ట్రేషన్, రెండో గదిలో వ్యాక్సినేషన్, మూడోది అబ్జర్వేషన్ గది ఉంటుంది.