రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగింది. పలు జిల్లాలో వ్యాక్సిన్ కోసం ప్రజలు బారులు తీరారు. టీకా పట్ల అపోహలు అవసరం లేదని.. ప్రతి ఒక్కరు వేయించుకోవాలని అధికారులు సూచించారు.
కృష్ణా జిల్లా
కృష్ణాజిల్లా విజయవాడ రూరల్ మండలం నిడమానూరు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వం సూచించిన 29 సంస్థలుకు చెందిన 400 మందికి వ్యాక్సిన్ వేశారు.
శ్రీకాకుళం జిల్లా...
శ్రీకాకుళం జిల్లాలో కొవిడ్ వాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా జరుగుతోంది. జిల్లా కేంద్రంలోని ప్రశాంతి వృద్ధాశ్రమంలో ఆశ్రయం పొందుతున్న 40 మంది వృద్ధులకు నేడు మొదటి డోసు వాక్సిన్ వేశారు.
విజయనగరం జిల్లా...
విజయనగరం జిల్లా పార్వతిపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించారు. తొలివిడత వేసుకున్న చాలామంది రెండో డోసు కోసం బారులు తీరారు.
ఇదీ చదవండి:'భారత్లో డిసెంబర్ నాటికి వ్యాక్సినేషన్ పూర్తి'