కృష్ణాజిల్లా నాగాయలంక మండలం తలగడదీవిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ముగ్గురు ఉపాధ్యాయులకు కరోనా పాజిటివ్‌గా తెలింది. దీంతో స్థానికంగా ఆందోళన నెలకొంది. వైరస్ బారిన పడిన టీచర్లు విజయవాడలోని ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
పాఠశాలలో మొత్తం 286 మంది విద్యార్థులు, 12 మంది సిబ్బంది ఉన్నారు. అయితే శుక్రవారం 150మంది విద్యార్థులకు కొవిడ్ టెస్టులు నిర్వహించగా.. ఫలితాలు రావాల్సి ఉంది. ఈ క్రమంలో పాఠశాల సిబ్బంది, తల్లిదండ్రుల్లోనూ ఆందోళన నెలకొంది. జిల్లా విద్యాశాఖ సత్వరమే మెరుగైన చర్యలు తీసుకోవాలని పీఎంసీ ఛైర్మన్ పి. సురేష్ విఙ్ఞప్తి చేశారు. పాఠశాలలో శానిటైజేషన్ చర్యలు చేపట్టారు.