ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Indrakeeladri News: ఇంద్రకీలాద్రిపై కరోనా ఆంక్షలు.. ఆ దర్శనాలు పూర్తిగా నిలిపివేశాం: ఈవో - covid restrictions at kanakadurga temple

Covid Restrictions at Indrakeeladri: విజయవాడలోని కనకదుర్గ ఆలయంలో కరోనా ఆంక్షలు అమలు చేస్తున్నట్లు ఆలయ ఈవో భ్రమరాంబ ప్రకటించారు. ఆలయంలో పలు సేవలు పూర్తిగా నిలిపివేసినట్లు వెల్లడించారు.

covid restrictions at kanakadurga temple
covid restrictions at kanakadurga temple

By

Published : Jan 18, 2022, 10:39 PM IST

Vijayawada KanakaDurga Temple: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కరోనా ఆంక్షలు విధించినట్లు ఆలయ ఈవో భ్రమరాంబ వెల్లడించారు. ఆలయంలో దుర్గమ్మ అంతరాలయ దర్శనం, శఠారి పూర్తిగా నిలిపివేసినట్లు ప్రకటించారు. అన్ని ఆర్జిత సేవలకు 50 శాతం మాత్రమే భక్తులను అనుమతిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆలయంలో ఉచిత ప్రసాదాల పంపిణీ నిలుపుదల చేసినట్లు తెలిపారు.

దుర్గమ్మ దర్శనానికి పరిమిత సంఖ్యలోనే భక్తులకు అవకాశం ఇస్తున్నామని.. మాస్కు లేని భక్తులకు అనుమతించడం లేదన్నారు. ఇంద్రకీలాద్రిపై తక్కువ మొత్తంలోనే ప్రసాద విక్రయాలు నిర్వహిస్తున్నట్లు ఈవో భ్రమరాంబ పేర్కొన్నారు. కొవిడ్​ ఉద్ధృతి నేపధ్యంలో ఆంక్షలు అమలు చేస్తున్నామని.. భక్తులు సహకరించాలని ఈవో కోరారు.

ABOUT THE AUTHOR

...view details