కృష్ణా జిల్లా చల్లపల్లికి చెందిన ఆదిలక్ష్మికి కొవిడ్ పాజిటివ్‌గా తేలటంతో.. విజయవాడలోని కొవిడ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శుక్రవారం నిర్వహించిన పరీక్షల్లో ఆమెకు.. నెగెటివ్‌గా తేలింది. ఫలితంగా బాధితురాలిని డిశ్చార్జ్ చేయాలని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
ఆస్పత్రి భవనం పైనుంచి దూకి మహిళ ఆత్మహత్యాయత్నం - కృష్ణా జిల్లా నేర వార్తలు
కరోనా పాజిటివ్‌గా తేలటంతో.. విజయవాడ కొవిడ్ ఆసుపత్రిలోని చికిత్స పొందుతున్న ఓ మహిళ భవనం పైనుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన వైద్యులు బాధితురాలిని ఐసీయూకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఆస్పత్రి భవనం పై నుంచి దూకి మహిళ ఆత్మహత్యాయత్నం
అయితే.. భర్త ఇంటికి తీసుకువెళతాడో లేదోననే అనుమానం, గత కొద్ది నెలల క్రితమే కుమారుడు మృతి చెందటంతో మానసిక ఆందోళనకు గురైన బాధితురాలు.. ఆసుపత్రి రెండో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన ఆసుపత్రి సిబ్బంది మహిళను ఐసీయూకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆసుపత్రి వర్గాల సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
ఇదీచదవండి