రాష్ట్రంలో ఉన్న ప్రముఖ ఆలయాల్లో ఒకటిగా.. జిల్లాలో విజయవాడ దుర్గగుడి తర్వాత స్థానంలో వెలుగొందుతున్న కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలు శ్రీ తిరుపతమ్మ ఆలయ ఆదాయంపై కరోనా ప్రభావం పడింది. కేవలం మూడు నెలల వ్యవధిలో రూ. 7 కోట్ల ఆదాయానికి గండి పడింది. అదేవిధంగా ఆలయ ప్రాంగణంలో నిర్వహించే పలు రకాల వ్యాపారాలు నిలిచిపోవడంతో వాటి నుంచి వచ్చే ఆదాయం కూడా నిలిచిపోయింది.
తిరుపతమ్మ ఆలయానికి కరోనా దెబ్బ...3 నెలల్లో రూ.7 కోట్ల ఆదాయానికి గండి - పెనుగంచిప్రోలు శ్రీ తిరుపతమ్మ ఆలయ ఆదాయంపై కొవిడ్ తీవ్ర ప్రభావం
కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలు తిరుపతమ్మ ఆలయ ఆదాయంపై కొవిడ్ తీవ్ర ప్రభావం చూపింది. మూడు నెలల్లోనే రూ.7 కోట్ల ఆదాయానికి గండి పడింది.
ఆలయంలో వివిధ హోదాలో పనిచేసే అధికారులు, సిబ్బంది మొత్తం 104 మంది ఉన్నారు. కరోనా నేపథ్యంలో ఆలయాన్ని మూసి ఉంచిన ఐదు నెలల సమయంలో అధికారులు, సిబ్బందికి వేతనాల్లో కోత విధించారు. ఆలయంలో రెగ్యులర్ ఉద్యోగులుగా పనిచేస్తున్న 59 మందికి 50 శాతం, చివర గ్రేడు, అవుట్ సోర్సింగ్ విభాగాల్లో పనిచేస్తున్న 45 మందికి 10 శాతం జీతాల్లో కోతలు విధించారు. అయితే ఆగస్టు నెల నుంచి పూర్తిస్థాయి వేతనాలను ఇస్తున్నారు. గత ఐదు నెలల బకాయిలలో మూడు నెలల ఏరియర్స్ ఇప్పటికే చెల్లించారు.
ఇదీ చదవండి:కరోనా ఎఫెక్ట్ : పనిలేక పస్తులుంటున్న శిల్పకళాకారులు