కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండడం ప్రయాణాలపై పెను ప్రభావం చూపుతోంది. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణాలు అయితే..మరీ ఎక్కువగా పడిపోయింది. వైరస్ ఆందోళనతో ఆర్టీసీ బస్సు ఎక్కాలంటే ప్రయాణికులు.. వెనకడుగు వేస్తున్నారు. అవసరం అయితే తప్ప ప్రయాణాలు వద్దని ఆర్టీసీ అధికారులు కూడా సూచిస్తుండటంతో.. ప్రయాణాలు వాయిదా వేసుకుంటున్నారు.దీని ఫలితంగా పలు ప్రాంతాలకు తిరిగే అన్ని బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది.
పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, డీలక్స్, ఆల్ట్రా డీలక్స్ బస్సుల్లో.. సీట్లు నిండని పరిస్ధితి. ఈ నెల మొదటి వారంలో బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో 62 శాతం ఉండగా.... ఇప్పుడది సగటున 58 శాతానికి చేరుకుంది. విజయవాడ సిటీ బస్సుల్లో అయితే 40 శాతం సీట్లు మాత్రమే భర్తీ అవుతున్నాయి. పలు రూట్లలో బస్సులు.... ఖాళీగా తిరుగుతున్నాయి. సచివాలయానికి విజయవాడ నుంచి రోజూ పదుల సంఖ్యలో..బస్సులు నడుస్తుంటాయి. సచివాలయంలో కేసులు పెరగడంతో రాకపోకలు..... గణనీయంగా తగ్గాయి. కరోనా వ్యాప్తి చెందుతుందన్న భయంతో చాలా మంది వ్యక్తిగత వాహనాలను ఆశ్రయించడమే దీనికి ప్రధాన కారణం.
ఏసీ బస్సుల్లో వారం రోజులుగా ఆక్యుపెన్సీ రేషియోగణనీయంగా పడిపోతోంది. 40 శాతం మించి ప్రయాణాలు చేయటం లేదని..... అధికారులు చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఒక్క సీటు కూడా రిజర్వు కావడం లేదంటున్నారు. డీజిల్ రేట్లు పెరుగిన దృష్ట్యా... నష్టం వస్తుందని భావించి అలాంటి సర్వీసులను రద్దు చేసి..... ప్రయాణికులను మరో బస్సులో పంపుతున్నారు.