కృష్ణాజిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటికే 235 కేసులు నమోదు అయ్యాయి. వారిలో 27 మంది చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యారు. జగ్గయ్యపేట పట్టణం ,పెనుగంచిప్రోలు, గ్రామంలో ఇద్దరు కొవిడ్ బారిన పడి మృతి చెందినట్లు వైద్యశాఖ అధికారులు అధికారికంగా వెల్లడించారు.
ఇవి కాకుండా జగ్గయ్యపేట పట్టణంలో సుమారు వందమంది కొవిడ్ బారినపడి స్వీయ నిర్భంధంలో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. అదేవిధంగా వత్సవాయి, పెనుగంచిప్రోలు, జగ్గయ్యపేట మండలాల్లో పలు గ్రామాల ప్రజలు వ్యాధిబారిన పడినవారు విజయవాడ, ఖమ్మం హైదరాబాద్ వంటి నగరాలకు వెళ్లి ప్రైవేటు వైద్య సేవలు పొందుతున్నారు.
- స్థానికంగా కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేయాలి.. పరీక్షలు పెంచాలి