కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్ కోసం మచిలీపట్నంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కొవిడ్ కేర్ సెంటర్ను కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్, ఎస్పీ రవీంద్రనాథ్తో కలిసి మంత్రి పేర్ని నాని ప్రారంభించారు. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడంతో పాటు ప్రజలకు రక్షణ కవచంలా నిలుస్తున్న పోలీసు, వైద్య, పురపాలక సిబ్బంది ఎవరైనా వైరస్ బారినపడితే తక్షణమే ఆదుకునే విధంగా ప్రత్యేక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ విజ్ఞప్తి మేరకు అన్ని వైద్య సదుపాయలతో కొవిడ్ కేర్ సెంటర్ను ఏర్పాటు చేసిన్నట్లు మంత్రి చెప్పారు. పోలీస్ కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఈ సెంటర్లో ఆక్సిజన్, వెంటిలెటర్ సదుపాయలతో పాటు అవసరమైన వైద్యులు, నర్సింగ్ సిబ్బంది ఉండనున్నారు.
మచిలీపట్నంలో కొవిడ్ కేర్ సెంటర్ ప్రారంభం - Krishn District Latest News
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కొవిడ్ కేర్ సెంటర్ను మంత్రి పేర్ని నాని ప్రారంభించారు. ఫ్రంట్లైన్ వారియర్స్ కోసం దీన్ని ఏర్పాటు చేసినట్టు మంత్రి వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్, ఎస్పీ రవీంద్రనాథ్ బాబు పాల్గొన్నారు.
Kovid Care Center opens in Machilipatnam