ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నూజివీడు అమెరికన్ ఆసుపత్రిలో.. ఉచితంగా కొవిడ్ చికిత్స

కృష్ణా జిల్లా నూజివీడులోని అమెరికన్ ఆసుపత్రిలో 80 పడకలతో కొవిడ్ కేర్ సెంటర్ ప్రారంభమైంది. మున్సిపల్ ఛైర్ పర్సన్ రామిశెట్టి త్రివేణి దుర్గ, సబ్ కలెక్టర్ ప్రతిష్ట మాంగైన్ ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొవిడ్ టెస్ట్ చేయించుకున్న వారికి, 104 కాల్ సెంటర్ ద్వారా అమెరికన్ ఆసుపత్రిలో పడకలు కేటాయిస్తున్నట్టు తెలిపారు.

నూజివీడు అమెరికన్ ఆసుపత్రి
Nuziveedu american hospital

By

Published : May 3, 2021, 5:58 PM IST

కృష్ణా జిల్లా నూజివీడులోని అమెరికన్ ఆసుపత్రిలో 80 పడకలతో కొవిడ్ కేర్ సెంటర్​ను.. స్థానిక మున్సిపల్ ఛైర్ పర్సన్ రామిశెట్టి త్రివేణి దుర్గ, సబ్ కలెక్టర్ ప్రతిష్ట మాంగైన్ ప్రారంభించారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఇందులో ఉచిత వైద్యం అందుతుందని వారు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొవిడ్ టెస్ట్ చేయించుకుని పాజిటివ్ వచ్చిన వారికి, 104 కాల్ సెంటర్ ద్వారా అమెరికన్ ఆసుపత్రిలో పడకలు కేటాయిస్తున్నట్టు తెలిపారు.

కరోనా సోకి సీరియస్ గా ఉన్న వ్యక్తులను విజయవాడకు తరలిస్తారని, సాధారణ స్థితిలో ఉన్న వ్యక్తులకు నూజివీడులో వైద్యం అందిస్తారని చెప్పారు. మేటాస్ సంస్థల వైస్ ప్రెసిడెంట్ శ్యామ్ మోజెస్, మున్సిపల్ కమిషనర్ సయ్యద్ అబ్దుల్ రషీద్, మండల తహసీల్దార్ ఎం సురేష్ కుమార్, కోమిటి డాక్టర్ నరేంద్ర కృష్ణ, డాక్టర్ మృదుల్, డాక్టర్ భరత్, డాక్టర్ స్వర్ణలత, డాక్టర్ శ్రావ్య, డాక్టర్ షోరూన్, డాక్టర్ సునీల్, వైద్యులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

మాజీ ఎంపీ సబ్బం హరి కన్నుమూత

ABOUT THE AUTHOR

...view details