కృష్ణా జిల్లా అవనిగడ్డలో 50 పడకలతో కొవిడ్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని ఎమ్మెల్యే సింహాద్రి, ఆర్డీవో ఖాజవలి పేర్కొన్నారు. అవనిగడ్డ ఏరియా ఆసుపత్రిని ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు, ఆర్డీఓ ఖాజావలి పరిశీలించారు. విజయవాడలోని కొవిడ్ రెండోదశ పై జరిగిన సమావేశంలో.. అవనిగడ్డలో కొవిడ్ ప్రత్యేక వార్డు విషయం ప్రస్తావించగా.. జిల్లాకలెక్టర్ ఇంతియాజ్ ఆమోదం తెలిపారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అందుకు సంబంధించి ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించామన్నారు. 50 పడకల కొవిడ్ సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వ ఆసుపత్రి అనువుగా ఉందని ఆర్డీఓ వెల్లడించారు. మే 1 నుంచి అవనిగడ్డలో కొవిడ్ వైద్యం అందుబాటులోకి రానున్నదని ఖాజావలి స్పష్టం చేశారు.
అవనిగడ్డలో కొవిడ్ 50 పడకల ఆసుపత్రి.. - today MLA simhadri ramesh babu latest comments
ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు, ఆర్డీఓ ఖాజావలి అవనిగడ్డ ఏరియా ఆసుపత్రిని పరిశీలించారు. 50 పడకలతో కొవిడ్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని వారు తెలిపారు. మే 1 నుంచి కొవిడ్ వైద్యం అందుబాటులోకి రానున్నట్లు పేర్కొన్నారు.
![అవనిగడ్డలో కొవిడ్ 50 పడకల ఆసుపత్రి.. MLA simhadri ramesh babu examined the arrangements](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11575075-638-11575075-1619661696529.jpg)
ఆసుపత్రిని పరిశీలించిన ఎమ్మెల్యే