ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జిల్లాలో విస్తృతంగా కరోనా పరీక్షలు: కలెక్టర్ - జిల్లాలో విస్తృతంగా కరోనా పరీక్షలు: కలెక్టర్

రానున్న రోజుల్లో ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ కొవిడ్ పరీక్షలు చేయించుకోవచ్చని కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ స్పష్టం చేశారు. జిల్లాలో కొవిడ్-19 పరీక్షలు విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

జిల్లాలో విస్తృతంగా కరోనా పరీక్షలు: కలెక్టర్
జిల్లాలో విస్తృతంగా కరోనా పరీక్షలు: కలెక్టర్

By

Published : May 31, 2020, 6:11 PM IST

కృష్ణా జిల్లాలో కొవిడ్-19 పరీక్షలు విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ వెల్లడించారు. ఎక్కువ పరీక్షలు చేయటం ద్వారా వైరస్ సామాజిక వ్యాప్తిని నిరోధించవచ్చని ఆయన స్పష్టం చేశారు. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పరీక్షలు చేయించుకోవచ్చన్నారు. ఇందుకోసం జిల్లాతో పాటు నగరంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.

రానున్న రోజుల్లో ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ కొవిడ్ పరీక్షలు చేయించుకోవచ్చన్నారు. అనుమానం ఉన్న వారెవరైనా ముందుకు వచ్చి పరీక్షలు చేయించుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.

ABOUT THE AUTHOR

...view details