ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సంతానం లేదని దంపతుల ఆత్మహత్యాయత్నం - కృష్ణా జిల్లా తాజా క్రైమ్ న్యూస్

పిల్లలు కలగడం లేదని మనస్తాపంతో దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటన కృష్ణా జిల్లా అనాసాగరం గ్రామంలో జరిగింది. ఘటనలో భర్త మృతి చెందగా భార్య ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది.

సంతానం లేదని దంపతుల ఆత్మహత్యాయత్నం
సంతానం లేదని దంపతుల ఆత్మహత్యాయత్నం

By

Published : Jun 19, 2020, 3:59 PM IST

కృష్ణా జిల్లా నందిగామ మండలం అనాసాగరం గ్రామంలో విషాదం జరిగింది. సంతానం లేదనే మనస్తాపంతో పురుగుల మందు తాగి దంపతులు ఆత్మహత్యాయత్నం చేశారు. వివాహమై తొమ్మిదేళ్లు గడుస్తున్నా... పిల్లలు కలగకపోవడం బాలకృష్ణ, త్రివేణిలను తీవ్ర మనోవేదనకు గురి చేసింది. సంతానలేమి బలవన్మరణానికి కారణమైంది. ఈ ఘటనలో భర్త బాలకృష్ణ మృతి చెందగా... తీవ్ర అస్వస్థతకు గురైన త్రివేణిని గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాలకృష్ణ మృతదేహాన్ని నందిగామ మార్చురీకి తరలించారు.

ఇదీ చూడండి:రోడ్డు ప్రమాదంలో నవ దంపతులు దుర్మరణం

ABOUT THE AUTHOR

...view details