అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులతో దంపతులు ఆత్మహత్యకు యత్నించారు. ఈ ఘటనలో భార్య మృతి చెందగా, భర్త పరిస్థితి విషమంగా మారింది. హైదరాబాద్లోని రహమత్ నగర్లో నివసించే సుబ్బారావు, సాయి లక్ష్మి భార్యా - భర్తలు. సాయి లక్ష్మి కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతుండగా.. ఇటీవలే బ్రెయిన్ సర్జరీ చేయించారు. ఇటూ అనారోగ్య సమస్యలు, మరోవైపు ఆర్థిక ఇబ్బందులు ఆ కుటుంబాన్ని వెంటాడాయి. తట్టుకోలేని భర్త తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకునేందుకు నిర్ణయించుకున్నాడు.
అనారోగ్యంతో బాధపడుతున్న భార్యను పంజాగుట్టలోని స్వరాజ్ రిహాబిలిటేషన్ సెంటర్లో చేర్చాడు. పరిస్థితి మరింత విషమించి భార్యకు గుర్తుతెలియని విషం ఇచ్చి తాను కూడా సేవించాడు. ఆమె మృతి చెందగా.. భర్త సుబ్బారావు అపస్మారక స్థితిలోకి చేరాడు.