కృష్ణా జిల్లా నందిగామ మార్కెట్ యార్డులో రైతులు ధర్నా చేపట్టారు. సీసీఐ కొనుగోలు కేంద్రం ప్రారంభించినప్పటికీ.. గత 4 రోజులుగా పత్తి కొనుగోలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పత్తిలో నాణ్యత లేదని, తేమ శాతం ఎక్కువగా ఉందని సాకులు చెప్తున్నారని రైతులు అన్నారు. రైతులకు భాజపా, వామపక్షాలు, జనసేన నాయకులు మద్దతు తెలిపారు.
సుమారు వెయ్యి బోరాల పత్తిని.. యార్డు ఆవరణలో ఫ్లాట్‌ఫారంపై రైతులు ఉంచారు. ఇదిలా ఉండగా నివర్ తుపాను హెచ్చరికలతో రైతులు మరింత ఆందోళన చెందుతున్నారు. వర్షం వస్తే ఆరుబయట ఉంచిన పత్తి తడిసిపోతోందని.. వెంటనే సీసీఐ అధికారులు కొనుగోలు చేయాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు.