కృష్ణాజిల్లా మైలవరం మండలం పుల్లూరు పంచాయతీ కొత్తగూడెం జాతీయ రహదారిపై రైతులు ధర్నా చేశారు. గ్రామానికి చెందిన కరుణ ప్రసాద్ అనే వ్యాపారి డబ్బులు తరువాత చెల్లిస్తానని పత్తిని రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేశాడు. 7కోట్లు రూపాయలు బాకీ చెల్లించుకుండా కోర్టు నుండి ఐపీ నోటీసులు పంపించాడని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సదరు వ్యాపారిపై కేసు నమోదు చేసి న్యాయం చేయాలని... లేనిపక్షంలో ఆత్మహత్యలే శరణ్యమని మొర పెట్టుకుంటున్నారు.
పత్తి రైతులకు వ్యాపారి టోకరా.. 7కోట్లు స్వాహా - kottagudem
పత్తి రైతుల దగ్గర నుంచి ఓ వ్యాపారి పత్తి అప్పుగాకొని సుమారు 7కోట్లకు ఐపీ నోటీసులు పంపిన ఘటన కృష్ణాజిల్లా మైలవరం మండలం కొత్తగుడెంలో చోటు చేసుకుంది. దీనికి నిరసిస్తూ... పత్తి రైతులంతా జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు.
జాతీయ రహదారిపై ధర్నాచేస్తున్న పత్తి రైతులు