దివిసీమలో ప్రముఖ పర్యటక ప్రాంతంగా ఉన్న పాలకాయతిప్ప వద్ద సాగరసంగమం ప్రదేశానికి పర్యటకులను అనుమతించటం లేదు. కృష్ణా వన్యప్రాణి అభయారణ్యంలో గేట్లు మూసివేశారు. బీచ్లో సముద్ర స్నానాలకు ఎవరిని వెళ్లనివ్వటం లేదు. కరోనా ప్రభావం తగ్గే వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని, అందుకు పర్యటకులు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
కరోనా ఎఫెక్ట్: పాలకాయతిప్ప బీచ్ గేట్లు మూసివేత - corona effect news in ap
కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా.. పర్యటక ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు. పాలకాయతిప్ప బీచ్, కృష్ణా వన్యప్రాణి అభయారణ్యంలోనికి ఎవరిని లోనికి వెళ్లకుండా అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకున్నారు.
'కరోనా దృష్ట్యా పాలకాయతిప్ప బీచ్ వద్ద గేట్లు మూసివేత'