వారంతా ఒక ప్రాంతానికి చెందిన వారే. ఏళ్ల తరబడి అన్నిరకాల ఎన్నికలకు ఒకే పోలింగ్‌బూత్‌లో ఓట్లు వేస్తున్నారు. విజయవాడ నగరపాలక ఎన్నికల్లో మాత్రం వేరొక చోట ప్రజా తీర్పుచెప్పాలంటూ ఓటరు లిస్ట్ తయారైంది. ఎమ్మెల్యే లేక ఎంపీనో ఎన్నుకునేట్లైతే నియోజకవర్గం మారకుండా ఓటు ఎక్కడ వేసిన పర్లేదులే అనుకోవచ్చు. కానీ తమ ప్రాంత సమస్య పరిష్కారంకోసం ఎన్నుకోవాల్సిన కార్పొరేటర్‌ను కాకుండా వేరొక డివిజన్ కార్పొరేటర్‌ను ఎన్నుకోండి అనేలా ఓటర్ జాబితా ఉండటంతో అయోమయానికి గురవుతున్నారు. ఇలా ఒకటి కాదు రెండుకాదు ఏకంగా 3వందలపైచిలుకు ఓట్లు ఇతరత్రా డివిజన్లకు సర్దుబాటయ్యాయి. భవిష్యత్‌లో తమకేదైనా సమస్య వస్తే ఏ డివిజన్ కార్పొరేటర్‌కు చెప్పుకోవాలంటూ వాపోతున్నారు. డిజిటల్ ఇంటినెంబర్ల ఆధారంగా రూపొందించిన ఓటర్ లిస్టుతో తలెత్తిన సమస్యలపై స్పందించే అధికారులు కరువయ్యారంటున్నారు బాధితులు.
మున్సిపల్ ఎన్నికల వేళ.. కొన్ని డివిజన్లలో గందరగోళం - ఏపీలో మున్సిపల్ ఎన్నికలు
మున్సిపల్ ఎన్నికల వేళ కొన్ని డివిజన్లలో గందరగోళం నెలకొంది. ఎప్పటినుంచో ఒక ప్రాంతంలో ఉన్న ఓట్లను మరో డివిజన్లోకి మార్చడంపై జనం ఆందోళన చెందుతున్నారు. నివాసం ఉంటున్న ప్రాంతానికి దూరంగా ఓటు వేస్తే... ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎవరిని అడగాలని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా పొరపాటును సరిదిద్ది... నివాసం ఉంటున్న ప్రాంతంలో ఓటు వేసే అవకాశం కల్పించాలని కోరుతున్నారు.
మున్సిపల్ ఎన్నికల వేళ కొన్ని డివిజన్లలో గందరగోళం