కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలుకు చెందిన తొండపు గోపాల్‌రావు అనే వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందాడు. మృతినికి ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కుమారుడు వెంకటరామ ప్రసాద్ అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. తండ్రి మరణ వార్త తెలిసినా... కరోనా దృష్ట్యా అంతర్జాతీయ విమానాలను రద్దయిన పరిస్థితుల్లో స్వగ్రామానికి రాలేకపోయాడు. విధిలేని పరిస్థితుల్లో.. కుమార్తె లక్ష్మి.. తండ్రికి అంత్యక్రియలు నిర్వహించింది. సంప్రదాయ కార్యక్రమాలను పూర్తి చేసింది.
కూతురితో తండ్రికి తలకొరివి పెట్టించిన 'కరోనా'! - corona effect news in krishna district
కరోనా ప్రభావంతో తన తండ్రి అంత్యక్రియలకు హజరుకాలేకపోయాడు కుమారుడు. చేసేది లేక కూతురే కొడుకు స్థానంలో ఉండి తండ్రికి కర్మకాండలు నిర్వహించింది. ఈ ఘటన కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు గ్రామంలో జరిగింది.
'కొడుకు ఉండగా కూతురే దిక్కైంది'