తెలంగాణలో ఎక్కడా లేని విధంగా మొత్తం కరోనా కేసుల్లో సగానికి పైగా భాగ్యనరంలోనే నమోదవటం ఆందోళన కలిగిస్తోంది. కొంతకాలంగా ప్రభుత్వం నగరంలో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినా.. పెద్దగా ప్రయోజనం కనిపించటంలేదు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 858 మందికి కరోనా సోకగా... వీరిలో 486 మంది జీహెచ్ఎంసీ పరిధిలోని వారే కావడం గమనార్హం. నగరంలో పెరుగుతున్న కేసులను దృష్టిలో ఉంచుకుని సర్కారు... ఇప్పటికే 151 కంటైన్మెంట్ జోన్లను ప్రకటించింది. ఆయా ప్రాంతాల్లో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవటంతో పాటు.... ప్రజలకు అవసరమై సామగ్రిని ఇంటికే పంపిస్తున్నారు. అయినప్పటికీ కేసులు తగ్గుముఖం పట్టడంలేదు.
ఆదివారం ఒక్కరోజే 49 కేసులు..
ఆదివారం నమోదైన 49 కేసులు సహా ఇప్పటి వరకు రాష్ట్రంలో 858 మందికి కరోనా సోకింది. ఆదివారం ఒక్కరోజే ముగ్గురు ఈ మహమ్మారికి బలైనట్టు వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. ఇప్పటివరకు వైరస్‌తో మృతి చెందిన వారి సంఖ్య 21కి చేరింది. కరోనా నుంచి కోలుకుని 186 మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 651 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. కరోనా మహమ్మారి కోరల్లో చిక్కుకుని అభం శుభం తెలియని పసికందు మృతి చెందాడు. నారాయణపేట జిల్లాకు చెందిన రెండునెలల బాబు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యవర్గాలు తెలిపాయి.
మూడు జిల్లాలు మినహాయిస్తే..