విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిపై కరోనా బాధిత కుటుంబ సభ్యులు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఆరోగ్యశ్రీ ఉన్నప్పటికీ తనకు చికిత్స చేయడానికి ఆస్పత్రి సిబ్బంది నిరాకరించారని.. విస్సన్నపేటకు చెందిన నాగుల రమేశ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. నగదు రూపంలో డబ్బులు చెల్లించిన తర్వాతే ఆస్పత్రిలో చేర్చుకున్నారని తెలిపారు. అనంతరం ఈ నెల ఆరో తేదీన తనను డిశ్చార్జి చేయాలంటే 7 లక్షల 35 వేలు చెల్లించాలని ఆస్పత్రి సిబ్బంది డిమాండ్ చేశారని వాపోయారు. పూర్తి డబ్బు నగదు రూపంలో చెల్లించామని.. వాటికి బిల్లులు కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆరోగ్యశ్రీ ఉన్నా వైద్యానికి నో..ఫీజు చెల్లించాకే డిశ్చార్జ్.. - latest news in vijayawada
విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిపై కరోనా బాధిత కుటుంబం కృష్ణా జిల్లా యంత్రాంగానికి ఫిర్యాదు చేసింది. ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్సకు నిరాకరించి.. నగదు చెల్లించిన తర్వాతే ఆస్పత్రిలో చేర్చుకున్నారని తెలిపారు. నిబంధనలు అతిక్రమించినందున తగు చర్యలు తీసుకోవాలని కోరారు.
ఓ ప్రైవేట్ ఆస్పత్రిపై కరోనా బాధిత కుటుంబసభ్యులు కలెక్టర్‌కు ఫిర్యాదు