ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 2, 2021, 9:04 PM IST

ETV Bharat / state

రాష్ట్రంలో విజయవంతంగా డ్రై రన్ : వైద్యారోగ్యశాఖ కమిషనర్

రాష్ట్రంలో నిర్వహించిన డ్రైరన్ విజయవంతం అయినట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్ స్పష్టం చేశారు. 954 మందికి డమ్మీ వ్యాక్సినేషన్ ఇచ్చామని అన్నారు. వ్యాక్సిన్ వినియోగానంతరం తలెత్తిన సమస్యలను వైద్యులు పరిష్కరించారని స్పష్టం చేశారు.

Corona vaccine dry run successfully in andhrapradhesh
రాష్ట్రంలో విజయవంతంగా డ్రైరన్ : వైద్యారోగ్యశాఖ కమిషనర్

కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన కొవిడ్-19 వ్యాక్సిన్ డ్రైరన్ ప్రక్రియ విజయవంతంగా ముగిసిందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్ స్పష్టం చేశారు. 13 జిల్లాల్లో 39 కేంద్రాలలో నిర్వహించిన ఈ ప్రక్రియలో ఒక్కో కేంద్రంలో 25 మంది హెల్త్ కేర్ వర్కర్లకు నమూనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి 975 మంది పేర్లు నమోదు చేసుకోగా... 954 మందికి డమ్మీ వ్యాక్సినేషన్ ఇచ్చామని వెల్లడించారు.

వివిధ సమస్యల కారణంగా 21 మందికి వ్యాక్సినేషన్ చేయలేదని అన్నారు. వాక్సిన్ వినియోగానంతరం 32 మైనర్, 26 మేజర్ సమస్యలు తలెత్తాయని పేర్కొన్నారు. వైద్యుల సహాయంతో వీటిని పరిష్కరించగలిగామని స్పష్టం చేశారు.

ఇదీచదవండి.

రాష్ట్రంలో కొత్తగా 238 మందికి కరోనా.. ముగ్గురు మృతి

ABOUT THE AUTHOR

...view details