కృష్ణాజిల్లా నూజివీడులో ప్రభుత్వ అనుమతులు లేకుండా కొవిడ్ టెస్టులు చేస్తూ.. కరోనా కిట్లు అమ్ముతున్న వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 954 కిట్లు స్వాధీనం చేసుకున్నారు.
నూజివీడు డీఎస్పీ శ్రీనివాసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని తిరువూరు బస్టాండ్ వద్ద ఉన్న వెంకటసాయిదుర్గ ఫ్యాన్సీ స్టోర్లో అనధికారికంగా కొవిడ్ కిట్లు అమ్ముతున్నారు. అలానే కొత్తపేటకు చెందిన సుధీర్ కుమార్ అనే ప్రైవేట్ టెక్నీషియన్ ప్రభుత్వ అనుమతి లేకుండా కరోనా పరీక్షలు చేస్తున్నాడు. ఒక్కో టెస్టుకు రూ. 3వేలు చొప్పున వసూలు చేస్తున్నాడు.