కృష్ణా జిల్లా నాగాయలంక మండలంలో రోజురోజుకీ కొవిడ్ 19 బాధితులు ఎక్కువవుతుండటంతో.. మార్కెట్ యార్డులో కరోనా టెస్టులు నిర్వహించారు. నాగాయలంకలో కరోనాతో మృతి చెందిన నలుగురి ప్రైమరీ కాంటాక్టులకు వారం రోజుల క్రితం.. కొవిడ్ టెస్టులు నిర్వహించారు. ఆ టెస్టుల రిపోర్టులు రాకపోవటం.. మండలంలో కరోనా టెస్టులు పెరిగిపోవటంతో నేడు నాగాయలంక మార్కెట్ యార్డులో మళ్లీ పరీక్షలు నిర్వహించారు. కొవిడ్19 ఐమాస్క్ వాహనం ద్వారా సుమారు 70 మందికి టెస్టులు చేశారు. ఎవరూ అధైర్యపడవద్దనీ.. ఏ సహాయం కావాలన్నా తనను సంప్రదించాలని అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు హామీ ఇచ్చారు.
నాగాయలంక మార్కెట్ యార్డులో కరోనా టెస్టులు - nagayalanka corona tests latest news
కృష్ణా జిల్లా నాగాయలంక మండలంలో కొవిడ్ 19 ఐమాస్క్ వాహనం ద్వారా కరోనా పరీక్షలు నిర్వహించారు. మండలంలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువ కావటంతో కరోనా పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.
నాగాయలంకలో కరోనా టెస్టులు