ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ముగ్గురు విలేకరులకు కరోనా నిర్ధరణ పరీక్షలు - మోపిదేవి మండలంలో కరోనా పరీక్షలు వార్తలు

కరోనా విజృంభిస్తున్న కారణంగా అనుమానం ఉన్న వారందరికీ కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు మోపిదేవి మండల పరిధిలోని గ్రామాల ప్రజలతోపాటు.. న్యూస్ కవరేజ్​కి వెళ్లిన ముగ్గురు జర్నలిస్టులు... పరీక్షలు చేయించుకున్నారు.

Corona tests for three journalists in mopidevi mandal in krishna
Corona tests for three journalists in mopidevi mandal in krishna

By

Published : May 9, 2020, 7:31 PM IST

కృష్ణా జిల్లా మోపిదేవి మండలం మోపిదేవి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కరోనా నిర్ధరణ పరీక్షలు జరిగాయి. ఈ మేరకు మోపిదేవి మండల పరిధిలో ఉన్న గ్రామాల్లో కరోనా అనుమానం ఉన్న వందలాదిమందిని పరీక్షించారు.

వైద్యసిబ్బంది కోవిడ్-19 పరీక్షలు చేశారు. న్యూస్ కవరేజ్ కోసం వెళ్ళిన ముగ్గురు జర్నలిస్టులు సైతం కరోనా పరీక్షలు చేయించుకున్నారు. రెండు రోజుల తరువాత వివరాలు తెలియజేస్తామని వైద్యశాఖ అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details