ఇండియన్ మెడికల్ అసోసియేషన్-బెజవాడ ఆధ్వర్యంలో... పాత్రికేయులు, వైద్యారోగ్య సిబ్బందికి కరోనా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలను మే నెల 3 వ తేదీ వరకు కొనసాగిస్తామని డాక్టర్ మధుసూదన్ తెలిపారు. నమూనాలు సేకరించిన వారి పరీక్ష ఫలితాన్ని వారి వారి చరవాణులకు పంపిస్తాని ఆయన తెలిపారు. పాత్రికేయులు, నర్సులు, వైద్యులు, ఆరోగ్య సిబ్బంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
పాత్రికేయులు, ఆరోగ్య సిబ్బందికి కరోనా పరీక్షలు - విజయవాడలో లాక్డౌన్ ప్రభావం
కరోనా ఆపత్కాల పరిస్థితుల్లో అత్యవసర సేవలందిస్తున్న పాత్రికేయులు, వైద్యారోగ్య సిబ్బందికి... కరోనా స్క్రీనింగ్ పరీక్షలు చేశారు. ఐఎమ్ఏ-బెజవాడ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
కరోనా పరీక్షల కోసం సిద్ధంగా ఉన్న రక్త నమూనాలు