ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రహస్యంగా మృతదేహం ఖననం.. వెలికితీసిన అధికారులు

మహారాష్ట్రలో మరణించిన ఓ వ్యక్తి మృతదేహాన్ని అతని స్వగ్రామానికి తీసుకొచ్చి రహస్యంగా ఖననం చేశారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేయగా.. పోలీసు​, రెవెన్యూ అధికారులు మృతదేహానికి పరీక్షలు నిర్వహించేందుకు వెలికి తీశారు. కృష్ణా జిల్లా చందర్లపాడులో జరిగిన ఘటన వివరాలివి..!

మృతదేహానికి కరోనా పరీక్షలు
మృతదేహానికి కరోనా పరీక్షలు

By

Published : Apr 27, 2020, 11:47 PM IST

కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం తుర్లపాడుకు చెందిన ఓ వ్యక్తి లారీ క్లీనర్​గా పనిచేస్తున్నాడు. అతను మహారాష్ట్రలో చనిపోగా మృతదేహన్ని తుర్లపాడు గ్రామంలో బంధువులు ఖననం చేశారు. గుండెపోటుతోనే చనిపోయినట్లు వారు తెలిపారు. అయితే గ్రామస్థులు దీనిపై అనుమానం వ్యక్తం చేయగా.. సమాచారం అందుకున్న రెవెన్యూ, పోలీసు అధికారులు కరోనా పరీక్షలు చేసేందుకు మృతదేహాన్ని వెలికితీశారు.

మృతదేహాన్ని ఎలా తీసుకొచ్చారు?

మహారాష్ట్ర నుంచి మృతదేహాన్ని అన్ని బోర్డర్‌ చెక్​పోస్టులు దాటి ఎలా తీసుకొచ్చారని గ్రామస్థులు ప్రశ్నించారు. రెడ్​జోన్​ ప్రాంతమైన ముప్పాళ్ల గ్రామంలో పోలీసులు రెండు చెక్​పోస్టులను ఏర్పాటు చేయగా వాటిని దాటి తుర్లపాడులోకి ఎలా వచ్చారని ఆందోళన చెందుతున్నారు. కరోనా పరీక్షలు నిర్వహించకుండా మృతదేహాన్ని లారీలో నుంచి జేసీబీ ద్వారా ఊరి రోడ్డు పక్కన గొయ్యి తీసి ఎవరికీ తెలియకుండా ఖననం చేయడంపై గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి:

కరోనా సోకిందన్న అనుమానంతో వ్యక్తి ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details