ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జిల్లాలో 409కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు

కృష్ణా జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 409కి చేరింది. తాజాగా బుధవారం మధ్యాహ్నం నుంచి గురువారం ఉదయం 10గంటల మధ్య 13 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

corona possitive cases
corona possitive cases

By

Published : May 22, 2020, 10:20 AM IST

కృష్ణా జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 409కి చేరింది. తాజాగా బుధవారం మధ్యాహ్నం నుంచి గురువారం ఉదయం 10గంటల మధ్య 13 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కొత్త కేసుల సంఖ్యను జిల్లా యంత్రాంగం అధికారికంగా ప్రకటించడం లేదు. కొత్తగా వచ్చిన కేసులన్నీ విజయవాడ నగరంలోనే ఉన్నాయి. విజయవాడలోని కృష్ణలంక, కొత్తపేట, కె.ఎల్‌.రావునగర్, గొల్లపాలెంగట్టు, దీన్‌దయాల్‌నగర్, విద్యాధరపురం ప్రాంతాల్లో ఇవి నమోదయ్యాయి. గొల్లపాలెంగట్టు ప్రాంతంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురికి పాజిటివ్‌ వచ్చింది. ప్రధానంగా కృష్ణలంక, వన్‌టౌన్‌ ప్రాంతాల్లోనే అత్యధిక సంఖ్యలో కేసులొస్తున్నాయి. ఇక్కడ జనం నిర్లక్ష్యం కూడా ఇందుకు కారణమని అధికారులు ఎంతగా చెబుతున్నా.. పట్టించు కోవడం లేదు. కరోనా వైరస్‌ నేపథ్యంలో లాక్‌డౌన్‌ను ప్రకటించి నేటికి సరిగ్గా రెండు నెలలు కావొస్తోంది. ఈ రెండు నెలల్లో రాష్ట్రంలోని అత్యధిక కేసులు నమోదైన మొదటి మూడు జిల్లాల్లో కృష్ణా కూడా ఒకటి కావడం ఆందోళన కలిగించే అంశం. మార్చి 21న జిల్లాలో తొలి కేసు విజయవాడలో నమోదైంది. నెలాఖరు వరకూ పెద్దగా నమోదుకాలేదు.


కేవలం ఆరు కేసులు మాత్రమే ఏప్రిల్‌ నెల ఆరంభమైనప్పటి నుంచి అమాంతం పెరిగిపోయాయి. ఈ ఒక్కనెలలోనే మొత్తం 240 పాజిటివ్‌ కేసులు జిల్లాలో వెలుగుచూశాయి. మే 20 తేదీ వరకూ మొత్తం 150 కేసులు వచ్చాయి.


మరింత జాగ్రత్త..
జిల్లాలో కలుషిత జోన్లు మినహా మిగతా ప్రాంతాలన్నింటిలో దుకాణాలు తెరిచేందుకు అనుమతి ఇచ్చారు. ఇది కేవలం ప్రజల వెసులుబాటు కోసమే. కరోనా వైరస్‌ నుంచి ఎలాంటి మినహాయింపులు లేవు. సామాజిక వ్యాప్తి నేపథ్యంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా.. అది మొత్తం కుటుంబాన్ని కబలిస్తుందనే వాస్తవాన్ని ప్రతిక్షణం గుర్తుంచుకోవాలి. బయటకు వస్తే.. తప్పనిసరిగా భౌతిక దూరం పాటించడం, శానిటైజర్లను వెంట ఉంచుకోవడం అలవాటు చేసుకోవాలి.


ఇదీ చదవండి:

విశాఖ దుర్ఘటనపై కేంద్ర రసాయన నిపుణుల కమిటీ పరిశీలన

ABOUT THE AUTHOR

...view details