కృష్ణా జిల్లా ఎ.కొండూరు మండలం కంభంపాడులో కరోనా కలకలం రేపింది. కంభంపాడు ప్రధాన రహదారిలో వస్త్ర దుకాణం నిర్వహించే వ్యాపారి కుటుంబంలో నలుగురికి కరోనా పాజిటివ్ నిర్ధరణ అయిందని తహసీల్దార్ బాలకృష్ణారెడ్డి అధికారికంగా ప్రకటించారు.
ఈ క్రమంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. గ్రామంలో దుకాణాలన్నింటినీ మూసివేయించారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని.. అనవసరంగా ఎవరూ బయటకు రావొద్దని సూచించారు.