కృష్ణాజిల్లా ముసునూరు మండలం జిల్లా పరిషత్ హైస్కూల్లో ఐదుగురు విద్యార్థులకు, ఓ ఉపాధ్యాయుడికి కరోనా సోకడం కలకలం రేపింది. పాఠశాలకు చెందిన ఆరో తరగతి విద్యార్థి, ఎనిమిదో తరగతికి చెందిన ఇద్దరు, పదో తరగతికి చెందిన ఇద్దరికి, ఓ ఉపాధ్యాయుడికి కరోనా సోకింది. విద్యార్థులందరూ ముసునూరుకు చెందినవారే. ప్రభుత్వ వైద్యులు వీరికి మెడికల్ కిట్లు అందజేసి... హోం ఐసోలేషన్లో ఉంచారు.
CORONA CASES IN SCHOOLS: ముసునూరు జడ్పీ హైస్కూల్లో కరోనా కలకలం.. - ఏపీ 2021 వార్తలు
కృష్ణాజిల్లా ముసునూరు మండలం జిల్లా పరిషత్ హైస్కూల్లో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఐదుగురు విద్యార్థులు, ఓ ఉపాధ్యాయుడికి కరోనా పాజిటివ్ వచ్చింది. వీరందరినీ హోం ఐసోలేషన్లో ఉంచి చికిత్స అందజేస్తున్నారు.
ముసునూరు జడ్పీ హైస్కూల్లో కరోనా కలకలం.. విద్యార్థులతో పాటు ఉపాధ్యాయుడికీ పాజిటివ్
పాఠశాల మొత్తం శానిటైజ్ చేసి మిగతా విద్యార్థులు కూడా కరోనా పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రధానోపాధ్యాయులు తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పాఠశాలకు రెండు రోజులు సెలవులు ప్రకటించారు.
ఇదీ చూడండి:Fire accident: వీరపనేనిగూడెంలోని ప్లాస్టిక్ కర్మాగారంలో అగ్నిప్రమాదం