ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'రూ.45 వేల ఇంజక్షన్​ను.. రూ.90 వేలకు అమ్ముతున్నారు'​ - ఏపీలో కరోనా కేసుల వార్తలు

కరోనా వ్యాధి సోకిన వ్యక్తికి శ్వాస సంబంధ సమస్యలు తీవ్రమైతే అందుకు వాడే ఇంజెక్షన్ చాలా ఖరీదైంది. ఒక్క ఇంజెక్షన్ రూ.45 వేలు ఉన్న ధరను.. బహిరంగ మార్కెట్​లో రూ.90 వేలకు విక్రయిస్తున్నారు. డిమాండ్​కు తగిన స్టాక్ లేని కారణంగా.. ఎంతో మంది ఇంజక్షన్ అందక ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రైవేటు ఆస్పత్రిలో కరోనా చికిత్స పొందుతున్న ఓ వ్యక్తికి ఈ ఇంజక్షన్ అవసరమైతే.. దాని కోసం వారి కుటుంబం రెండు రోజులపాటు ఊరువాడా తిరిగారు. తీరా తీసుకొచ్చాక.. వైద్యలు మరొక ఇంజక్షన్ అవసరమవుతుందని.. లేదంటే ప్రాణానికి ప్రమాదమని చెప్పారు. ఏం చేయాలో ఆ కుటుంబ సభ్యులకు పాలుపోవట్లేదు.

corona medicine
corona medicine

By

Published : Jul 15, 2020, 11:04 PM IST

ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ కొవిడ్ బాధితుడికి శ్వాస సంబంధ సమస్యలు తీవ్రమయ్యాయి. ఆయనకు బాగా ఖరీదు అయిన ఇంజెక్షన్ వాడాలని వెంటనే తీసుకు రావాలని వైద్యులు బంధువులకు తెలిపారు. ఆసుపత్రిలోని ఔషధ దుకాణంలో అడిగితే లేదని చెప్పారు. దీనితో రెండు రోజుల నుంచి కుటుంబ సభ్యులు విజయవాడ, గుంటూరు ఔషధ దుకాణాల్లో సంప్రదించారు. ఎట్టకేలకు ఒక ఇంజక్షన్ కొనుగోలు చేశారు. ఇంజక్షన్ ధర 45 వేల రూపాయలు ఉండగా.. 90 వేల రూపాయలకు కొనుగోలు చేసినట్లు వారి బంధువులు తెలిపారు.

అయితే... మరో ఇంజక్షన్ కూడా తప్పని సరి అని వైద్యులు చెప్పటంతో ఔషధ దుకాణాల చుట్టూ తిరుగుతున్నారు. కరోనా బాధితుల్లో ప్రాణ వాయవు అవసరమైన దశలో కొన్ని కీలక ఔషధాలను అందిస్తున్నారు. అత్యవసర పరిస్తుతుల్లో ప్రయోగాత్మకంగా వినియోగించటానికి మాత్రమే భారతీయ వైద్య పరిశోధన మండలి కొన్ని ఔషధాలను అనుమతించింది. వీటిలో రెమ్ డెసివెర్, టోసిలీజుమాబ్ ప్రధానమైనవి. వీటిని వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే రోగికి ఇవ్వాలి.

టోసిలీజుమాబ్ ఉత్పత్తి పరిమిత సంఖ్యలో మాత్రమే ఉండటంతో మార్కెట్ లో లభించటం కష్టంగా మారింది. రోగుల అత్యావసరాన్ని కొందరు సోమ్ము చేసుకుంటున్నారు. రెమిడెసివెర్ ను కరోనా లక్షణాలు మధ్య తీవ్ర దశలోవున్న వారికి ఇస్తున్నారు. ఇది ఒక డోసు 4000, 5000 వరకు ఉంటుంది. ఇది కూడా పలు చోట్ల అధిక ధరకు విక్రయిస్తున్నట్లు సమాచారం. ప్రాణధార మందులను సరైన ధరలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.

దీనిపై ఔషధ నియంత్రణ పరిపాలన అధికారిని వివరణ కోరగా..ధరల రెట్టింపు గురించి తమ దృష్టికి రాలేదు అన్నారు. టోసిలీజుమాబ్ ఇంజక్షన్ ఉత్పత్తి తక్కువగా ఉండటంతో పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాని మాట వాస్తవమేనని తెలిపారు. ఈ ఇంజక్షన్ డిమాండ్ కు తగ్గట్లు ఉత్పత్తి కావట్లేదని ఆసుపత్రి వారికి మాత్రమే పంపిణీ జరగాల్సిన మందులు బయట.. పరిమితంగా అందుబాటులో ఉందని ఔషధ దుకాణ దారి ఒకరు తెలిపారు. ఈ ఇంజక్షన్ అడిగే వారి సంఖ్య క్రమంగా పెరుగుతుందని.. ఎక్కడ విక్రస్తున్నారో తెలియట్లేదనీ.. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లినట్లు ఔషధ దుకాణదారు చెప్తున్నారు.

ఇదీ చదవండి:

చిరంజీవి సర్జా ఇంట్లో కరోనా కలకలం

ABOUT THE AUTHOR

...view details