కృష్ణాజిల్లా చల్లపల్లి మండలం నాదేళ్లవారిపాలెంలో మహిళకు కరోనా లక్షణాలు ఉండటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ఆమె ఎవరెవరిని కలుసుకున్నారనే వివరాలు సేకరిస్తున్నారని అధికారులు తెలిపారు. వారం రోజుల క్రితం హైదరాబాద్ నుంచి ఐదుగురు కారులో వచ్చారు. నాదేళ్లవారిపాలెం గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు, పెదకళ్లేపల్లి గ్రామానికి చెందిన ఒక వ్యక్తి, చల్లపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు కారులో ఉన్నారు. వారిలో నాదేళ్లవారిపాలెం గ్రామానికి చెందిన మహిళకు కరోనా వచ్చింది. గ్రామం చుట్టూ చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. బ్లీచింగ్, సోడియం హైపో క్లోరైడ్ ద్రావణం పిచికారి చేస్తున్నారు. చల్లపల్లి తహసీల్దార్ కె.స్వర్ణమేరి, ఎస్ఐ నాగరాజు వైద్య శాఖ అధికారులు ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.
నాదేళ్లవారిపాలెంలో కరోనా.. అప్రమత్తమైన అధికారులు - corona in krishna district
కృష్ణాజిల్లా చల్లపల్లి మండలం నాదేళ్లవారిపాలెంలో అధికారులు కంటైన్మెంట్ జోన్ ఏర్పాట్లు చేస్తున్నారు. వారం రోజుల క్రితం హైదరాబాద్ నుంచి వచ్చిన మహిళకు కరోనా రావటంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
కృష్ణా జిల్లాలో కరోనా