కృష్ణాజిల్లా గన్నవరం మండలం కేసరపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో కరోనా కలకలం రేపింది. స్థానికంగా పనిచేసే ఓ ఉపాధ్యాయుడికి ఇటీవల కరోనా సోకడంతో వైద్య బృందం అప్రమత్తమైంది. పాఠశాలలో 160 మందికి పరీక్షలు నిర్వహించగా ముగ్గురు ఉపాధ్యాయులు, ఇద్దరు విద్యార్థులకు పాజిటివ్‌గా నిర్దరణ అయ్యిందని తెలిపారు. జడ్పీ, ప్రాథమిక పాఠశాలలు ఒకే ఆవరణలో ఉండటంతో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆందోళనకు గురవుతున్నారు. ఈనెల 8న జరగనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ పోలింగ్ కేంద్రంగా అధికారులు పాఠశాలను ఎంపిక చేయడంపై తీవ్ర విమర్శలు వెల్లువెతున్నాయి.
కరోనా కలకలం.. ముగ్గురు ఉపాధ్యాయులకు, ఇద్దరు విద్యార్థులకు పాజిటివ్ - కృష్ణాజిల్లా తాజా వార్తలు
కేసరపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో కరోనా కలకలం రేపుతోంది. ఓ ఉపాధ్యాయుడికి ఇటీవల కరోనా పాజిటివ్ రాగా.. పాఠశాలలో 160 మందికి పరీక్ష నిర్వహించారు. వారిలో ముగ్గురు ఉపాధ్యాయులు, ఇద్దరు విద్యార్థులకు కరోనా నిర్థరణ అయింది.
corona in Kesarapalli