ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

24 గంటలు అందుబాటులో కరోనా హెల్ప్ డెస్కులు - జగ్గయ్యపేట వార్తలు

కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో కరోనా రోజురోజుకూ విజృంభిస్తోంది. ఈ కారణంగా.. మున్సిపల్ కార్యాలయంలో 24 గంటలు అందుబాటులో ఉండేలా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తున్నట్లు తహసీల్దార్ రామకృష్ణ తెలిపారు.

krishna distrct
24 గంటలు అందుబాటులో హెల్ప్ డెస్కులు

By

Published : Jul 14, 2020, 7:09 PM IST

జగ్గయ్యపేట పట్టణంలో కొవిడ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. వైరస్ నియంత్రణ కోసం తహసీల్దార్ ఆధ్వర్యంలో అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేశారు. కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మున్సిపల్ కార్యాలయంలో 24 గంటలు అందుబాటులో ఉండేలా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తున్నట్లు తహసీల్దార్ రామకృష్ణ తెలిపారు.

అన్ని శాఖల ఉమ్మడి కార్యాచరణతో.. కరపత్రాలతో ప్రచారం, కఠిన నిబంధనలు అమలు చేయటం , ఇంటింటి సర్వే ద్వారా అనుమానిత కేసులను ముందుగా గుర్తించి హౌస్ క్వారంటైన్ లో ఉంచుతామన్నారు. అన్ని పార్టీల నాయకులు పోలీస్, మున్సిపల్, రెవిన్యూ, వైద్య శాఖ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details