కరోనా ప్రభావంతో కృష్ణా జిల్లా మోపిదేవి మండలం శ్రీవల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనానికి అధికారులు నిబంధనలు కఠినతరం చేశారు. ఆలయానికి వచ్చే ప్రతి భక్తుని ఆధార్, ఇంటి నెంబర్, ఫోన్ నెంబర్ను నమోదు చేసుకుంటున్నారు. 65 ఏళ్లు పైబడిన వృద్ధులు, పదేళ్లలోపు చిన్నారులను ఆలయంలోకి అనుమతించడం లేదు.
ఈ క్రమంలో భక్తులు స్థానికంగా ఉన్న గంజివానిపాలెంలో నాగేంద్ర స్వామి ఆలయం వద్ద పుట్టలో పాలు పోసి తలనీలాలు సమర్పించుకుంటున్నారు. కొంతమంది ఆధార్ తీసుకు రాకపోవడం వల్ల స్వామిని దర్శించుకోలేక వెనుదిరుగుతున్నారు. కరోనాతో ఆలయానికి భక్తుల రద్దీ తగ్గింది.