కరోనా వైరస్ ప్రభావం ఆర్టీసీపై పడింది. వైరస్ వ్యాప్తి చెందుతుండటం వల్ల చాలా మంది ప్రయాణం చేసేందుకు భయపడుతున్నారు. చల్లని ప్రదేశాల్లో వైరస్ ఎక్కువగా వ్యాపిస్తుందనే కారణంతో ఏసీ బస్సులు ఎక్కేందుకు వెనకడుగు వేస్తున్నారు. ఫలితంగా పలు ప్రాంతాలకు వెళ్లే ఏసీ బస్సుల్లో సీట్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. బస్సుల్లో ప్రయాణించేవారికి వైరస్ సోకకుండా ఆర్టీసీ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోంది. ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ శానిటైజర్లను అందుబాటులో ఉంచింది. కరోనా పట్ల ప్రయాణికులకు అవగాహన కల్పిస్తూనే నివారణ చర్యలు చేపట్టింది.
ఆర్టీసీపై కరోనా ప్రభావం.. ఖాళీగా దర్శనమిస్తోన్న బస్సులు
కరోనా ఆర్టీసీపై ప్రభావం చూపిస్తోంది. ఎక్కువగా గుమిగూడే ప్రదేశాల్లో వైరస్ వ్యాపిస్తోందన్న కారణంతో ప్రజలు బయటకు రావడానికే భయపడుతున్నారు. ఫలితంగా వివిధ ప్రాంతాలకు ప్రయాణం చేసే వారి సంఖ్య భారీగా తగ్గింది. ఈ క్రమంలో బస్సులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి.
ఆర్టీసీపై కరోనా ప్రభావం