అందానికి ఉన్న ఆకర్షణ, ఆదరణ నేటి ఆధునిక యుగంలో ఇంతా అంతా కాదు. అలాంటి అందానికి ఆధునిక మెరుగులు దిద్దేందుకు అవతరించినవే బ్యూటీపార్లర్‌లు. ఒకప్పుడు మెట్రో సిటీలకే పరిమితమైనా..ఇప్పుడు చిన్న పట్టణాలకూ విస్తరించాయి. ముఖ్యంగా యువతులు ఏ ప్రత్యేక సందర్భం వచ్చినా తమ అందానికి మెరుగులు దిద్దికుంటున్నారు. అందుకే ప్రతి వీధికీ మగవారి సెలూన్లకు పోటీగా బ్యూటీ పార్లర్లు వెలిశాయి.
అయితే గత 2నెలలుగా కరోనా ప్రభావం కారణంగా ఈ బ్యూటీపార్లర్లన్నీ మూతపడ్డాయి. నిర్వాహకులకు అద్దెల భారం అదనంగా మారింది. చాలా మంది గృహిణులు వారి ఇళ్లలోనే వీటిని నడుపుతూ ఎంతో కొంత సంపాదించుకునేవారు. కరోనా కారణంగా విధించిన లౌక్‌డౌన్ ఎవరికీ ఆదాయం లేకుండా చేసేసింది. సాధారణంగా వేసవి అంటేనే పెళ్లిళ్ల సీజన్. బ్యూటీషియన్లకు బాగా గిరాకీ ఉంటుంది.