బెంగళూరుకు చెందిన దేవరాజ్ చిన్నప్పుడే పోలియోకు గురైయ్యాడు. నడుము కింద భాగం పూర్తిగా పని చేయడం మానేసింది. అక్కడే ఉండి కుటుంబానికి భారం కాలేక విజయవాడకు వచ్చేశాడు. కేదారేశ్వరపేట పండ్ల మార్కెట్ సమీపంలో కిళ్లీ బడ్డీ పెట్టుకొని జీవనం సాగిస్తున్నాడు. కరోనా దాటికి లాక్డౌన్ విధించడం.. జన సంచారం లేక వ్యాపారం లేకుండాపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో తనకు ద్విచక్ర వాహనం జీవనాధారమైంది. ద్విచక్ర వాహనానికి చిన్న మంచం కట్టి తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. పోలీసులు అనుమతించిన సమయాల్లో పండ్లు అమ్ముతూ జీవనం కొనసాగిస్తున్నాడు. పోలియోతో కాళ్లు పని చేయకపోయినా ఒకరిపై ఆధారపడకుండా కష్టకాలంలోనూ మనోధైర్యంతో జీవనం సాగిస్తున్నాడు దేవరాజ్.
లాక్డౌన్ పరిస్థితిల్లోనూ వెరవని దివ్యాంగుడి మనోస్థైర్యం - ద్విచక్ర వాహనంపైనే జీవనం తాజా వార్తలు
కరోనా దాటికి ఎన్నో జీవితాలు విలవిలలాడుతున్నాయి. విధి వక్రించినా మనోధైర్యంతో నిలబడిన ఆ దివ్యాంగుడి జీవితం కరోనా ధాటికి మరింత దుర్భరమైంది. ఎవరిపై ఆధారపడకుండా కిళ్లీ కొట్టు పెట్టుకొని బతుకుతున్న తనకు లాక్డౌన్ కొత్త కష్టాలను తెచ్చిపెట్టిందంటూ బోరుమంటున్నాడు.
లాక్డౌన్తో ద్విచక్ర వాహనంపై జీవనం