కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు విజయవాడ నగరపాలక సంస్థ వినూత్న ఆలోచనలు చేస్తోంది. రాఘవయ్య పార్కులో కరోనా వైరస్ నమూనాలతో చెత్తబుట్టలను ఏర్పాటు చేసింది. బహిరంగ ప్రదేశాల్లో నమూనాలు ప్రదర్శించి... ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. అత్యవసర పరిస్థితుల్లోనే బయటకు రావాలని, మాస్కులు కచ్చితంగా ధరించాలని సిబ్బంది ప్రజలకు వివరిస్తున్నారు. బయటకు వచ్చిన వారు భౌతికదూరం పాటించాలని సూచిస్తున్నారు.
కరోనా చెత్తబుట్టలు... నగరపాలక సంస్థ వినూత్న ఆలోచనలు - COVID CASES IN VMC
కరోనాపై అవగాహన కల్పించేందుకు కృష్ణా జిల్లా విజయవాడ నగరపాలక సంస్థ వినూత్నంగా ప్రయత్నించింది. రాఘవయ్యపార్కులో కరోనా వైరస్ ఆకారంలో చెత్తబుట్టలను ఏర్పాటు చేశారు.
కరోనాపై అవగాహన కోసం నగరపాలక సంస్థ వినూత్న ఆలోచనలు
Last Updated : Jul 18, 2020, 5:07 PM IST