కరోనా రోగులకు సేవలు అందించేందుకు ప్రభుత్వం నియమించిన వైద్యులు, నర్సులు, సహాయకులు విజయవాడ ధర్నా చౌక్ వద్ద నిరసన చేపట్టారు. తమను ప్రభుత్వం ఉన్నపళంగా విధుల నుంచి తొలగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా తగ్గుతుందనే సాకుతో విధుల నుంచి తొలగించారని.. అన్ని అర్హతలూ ఉన్న తమను ప్రభుత్వ ఆసుపత్రుల్లో నియమించుకోవాలని కోరారు. తమను ఉద్యోగాల నుంచి తీసివేయడం ఎంతవరకు సబబని అని ప్రశ్నించారు.
ధర్నా చౌక్ వద్ద వైద్యులు, నర్సుల నిరసన - కరోనా వైద్యుల కష్టాలు తాజా వార్తలు
కరోనా సమయంలో తాత్కాలిక ప్రాతిపదికన తీసుకున్న వైద్యులు, నర్సులు, సహాయకులను.. ప్రభుత్వం విధుల్లో నుంచి తొలగించింది. కరోనా సమయంలో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా సేవలందిన తమను తొలగించడం అన్యాయమని.. బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే తమను విధుల్లోకి తీసుకోవాలని విజయవాడ ధర్నా చౌక్‌లో ఆందోళన చేశారు.
ధర్నా చౌక్ వద్ద వైద్యులు, నర్సుల నిరసన