రాష్ట్రంలో కరోనా అదుపులోకి రావడం లేదు. రోజువారీ కేసులు, మరణాలు ఎన్నడూ లేని రీతిలో పెరిగిపోతున్నాయి. ప్రభుత్వం, యంత్రాంగం ఎప్పటికప్పడు నియంత్రణ చర్యలు చేపడుతున్నా.. వైరస్ వ్యాప్తి అదుపులోకి రావడంలేదు. విశాఖ జిల్లా అనకాపల్లికి చెందిన తెలుగుదేశం కార్యకర్త కొణతాల తులసి... కరోనాతో విశాఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. రెండ్రోజుల క్రితమే ఆయన తల్లి వెంకట సూర్య అప్పల నరసమ్మ కొవిడ్ కారణంగా చనిపోయారు. అనకాపల్లికి చెందిన సీనియర్ పాత్రికేయులు.. రాపర్తి వెంకట్రావు కరోనా చికిత్స పొందుతూ.. ఎన్టీఆర్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు.ఐఎస్‌డబ్ల్యూలో ఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్న శ్రీరాంప్రసాద్.. కరోనా చికిత్స పొందుతూ... విజయవాడలోని ఓ ఆసుపత్రిలో చనిపోయారు.
గుంటూరు సర్వజనాసుపత్రి వైద్యుడు రాంబాబు కరోనాతో మృతిచెందారు. గుంటూరు జీజీహెచ్లో చికిత్స అనంతరం హైదరాబాద్ తరలించగా.. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. తెనాలికి చెందిన ఉపాధ్యాయుడు.. శరత్‌బాబు కరోనా చికిత్స పొందుతూ.. గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మృతిచెందారు. అనంతపురం జిల్లా కదిరిలో కరోనాతో మరణించిన కిరణ్‌కుమార్ అనే వ్యక్తి అంత్యక్రియలు నిర్వహించి స్థానిక యువకులు ఉదారత చాటుకున్నారు. లాక్‌డౌన్ వల్ల కుటుంబసభ్యులు రాలేని పరిస్థితుల్లో.. దిక్కుతోచక రోదిస్తున్న మృతుడి భార్యను గమనించిన యువకులు... దగ్గరుండి అంత్యక్రియలు జరిపించారు. కడప యోగి వేమన విశ్వవిద్యాలయం జంతుశాస్త్ర శాఖ పరిశోధక విద్యార్థిని డాక్టర్ ఆశా కిరణ్ కిరణ్‌కి కరోనా సోకి మృతి చెందారు. ఈమె మృతిపై ఉపకులపతి ఆచార్య మునగాల సూర్య కళావతి సంతాపం తెలిపారు. విశాఖ పురపాలక సంఘ కమిషనర్ పనిచేసిన వేగి సత్యనారాయణ కరోనాతో మృతి చెందారు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెనికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు తుట్టగుంట కృష్ణ శర్మ ఘగర్తో చనిపోయాడు.