కృష్ణా జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. మొత్తం కేసుల సంఖ్య 501కి చేరగా... మరో ఇద్దరు కరోనా వైరస్ బారినపడి మృతి చెందారు. జిల్లాలో మొత్తం మృతుల సంఖ్య 22కు చేరింది. తాజాగా వచ్చిన కొత్త కేసుల్లో ఆరు విజయవాడ నగర పరిధిలోనూ, రెండు మచిలీపట్నంలో వెలుగుచూశాయి. విజయవాడలోని కృష్ణలంక, చిట్టినగర్, సింగ్ నగర్లో కొత్త కేసులు వచ్చాయి. చిట్టినగర్‌కు చెందిన 34 ఏళ్ల యువకుడు, కృష్ణలంకకు చెందిన మరో వ్యక్తి కూడా కరోనా వైరస్ సోకటంతో మృతి చెందారు.
పాజిటివ్ కేసుల్లో చికిత్స పొంది ఇప్పటివరకూ 337 మంది ఆసుపత్రి నుంచి ఆరోగ్యవంతులుగా డిశ్ఛార్జై ఇళ్లకు చేరారు. మరో 142 మంది ప్రస్తుతం విజయవాడ, చిన్నఅవుటుపల్లిలోని కోవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కొత్తగా వస్తున్న కేసుల్లో 90 శాతం విజయవాడ నగరంలోనే ఉన్నా... జనంలో మాత్రం అసలు అవగాహనే ఉండడం లేదు. మృతుల సంఖ్య కూడా పెరుగుతోంది. మొత్తం కేసుల్లో విజయవాడ నగరంలోనే 400కు పైగా ఉన్నాయి.